సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది

సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది

Published on May 1, 2026 1:50 PM IST

విడుదల తేదీ : మే 01, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకుడు : రితేష్ రానా
నిర్మాతలు : చెర్రీ, హేమలత పెదమల్లి
సంగీతం : కాల భైరవ
ఛాయాగ్రహణం : సురేష్ సారంగం
కూర్పు : కార్తీక శ్రీనివాస్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

కమెడియన్ సత్య హీరోగా దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన అవైటెడ్ కామెడీ డ్రామానే జెట్ లీ. మంచి ప్రమోషన్స్, బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ప్రజాపతి (అజయ్) తన ప్రజాపతి బ్యాంక్ ని 15 వేల కోట్లకు దివాళా తీస్తాడు. అయితే తనని పట్టుకున్న స్పెషల్ ఏజెంట్ శివాని రాయ్ (రియా సింఘా) అతన్ని ప్రాణాలతో స్పెషల్ ఫ్లైట్ లో దుబాయ్ నుంచి కొచ్చి రావాల్సి ఉంటుంది. అయితే ఇదే ఫ్లైట్ లో ఉన్న డాక్టర్ వేద్ వ్యాస్ (సత్య) ఈ ఆపరేషన్ లోకి వస్తాడు. తన గతం ఏంటి అనేది మర్చిపోయి ఎంటర్ అయ్యిన తను ఏం చేశాడు? అసలు తను కూడా ఎందుకు ఆ ఫ్లైట్ లో ఉన్నాడు? తనకీ ఈ ఆపరేషన్ కి, ఆ బాంక్ స్కామ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటే చివరికి ఈ మిషన్ ఎలా ఎండ్ అయ్యింది? అసలు వేద్ వ్యాస్ ఎవరు తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

రితేష్ రానా, కమెడియన్ సత్య కాంబినేషన్ కోసం మినిమం ఐడియా ఉన్నవారికి అయినా ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ ఇంప్రెస్ చేస్తాయి. ముఖ్యంగా తన కామెడీ రైటింగ్ వన్ లైనర్స్, బాక్గ్రౌండ్ లో డీటెయిల్స్ ని మంచి ఫన్నీగా డిజైన్ చేసుకొని నవ్వించారు.

ఇక సత్య అయితే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. తన మార్క్ కామెడీ టైమింగ్, నటనతో అదరగొట్టాడు. మనకి చూసేందుకు సీన్స్ సింపుల్ కామెడీ గానే అనిపించినా ఇన్స్టంట్ వేరియేషన్స్, లాంగ్ లెంగ్త్ డైలాగ్స్ ని అలవోకగా చెప్తూ ఇంప్రెస్ చేశారు. ఇక తనతో పాటుగా వెన్నెల కిషోర్ తో ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. వీరి నడుమ కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి.

అలానే వెన్నెల కిషోర్ కూడా తన రోల్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు. ఇంకా విలన్ రోల్ లో అజయ్ మెప్పించారు, వైవా హర్ష తన తోటి కో పైలెట్ లపై కొన్ని కామెడీ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. అలానే హీరోయిన్ రియా గ్లామర్ గా కనిపిస్తూనే మంచి పెర్ఫామెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో బాగా చేసింది.

ఇక ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. ఇందులో మరో ఇంప్రెస్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమా నిర్మాణ విలువలు అని చెప్పొచ్చు. దాదాపు కథనం అంతా ఫ్లైట్ లోనే ఆ అట్మాస్పియర్ గాని విజువల్ ఎఫెక్ట్స్ గాని టాప్ నాచ్ లో కనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఇందులో అక్కడక్కడా మంచి ఫన్ ఉంది కాని వాటితో పాటుగా అంతర్లీనంగా బలమైన కథ మాత్రం మిస్ అయ్యిందని చెప్పాలి. ఆ కామెడీ సీన్స్ తప్ప ఇందులో మిగతా కథా, కథనాలు చాలా రొటీన్ ఫీల్ నే కలిగిస్తాయి.

ఫస్టాఫ్ పర్వాలేదు కానీ సెకండాఫ్ కొంచెం డల్ గా సాగింది. సత్య రోల్ ఒకింత కంప్లీట్ కాకుండా ప్రెజెంట్ చేశారు. అలానే మధ్యలో కొన్ని సీన్స్ రొటీన్ అండ్ బోరింగ్ గా సాగాయి. అలానే కొన్ని లాజిక్స్, సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటున్న సమయంలో కథనం మరింత బలహీనంగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడా వంక పెట్టడానికి లేదు. సాలిడ్ విజువల్స్ ని అందించారు. ఇందులో వి ఎఫ్ ఎక్స్ టీం ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి. ఇక కాల భైరవ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టీవ్ గా అందించారు. కెమెరా వర్క్ కూడా ఈ సినిమా బాగుంది. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది.

ఇక దర్శకుడు రితేష్ రానా విషయానికి వస్తే ఇందులో తన మార్కు కామెడీ కనిపిస్తుంది కానీ కథ, కథనాలు ఇంకా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. కామెడీ ఎపిసోడ్స్, వన్ లైనర్స్, నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లు బాగానే రాబట్టారు కానీ కథనం మాత్రం ఇంకా మెరుగ్గా డిజైన్ చేసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘జెట్ లీ’ స్ట్రిక్ట్ గా కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే కామెడీ ఫ్లిక్ అని చెప్పొచ్చు. సత్య, వెన్నెల కిషోర్ లతో రితేష్ ప్లాన్ చేసిన కామెడీ ట్రాక్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ కథనం మాత్రం ప్యాకెడ్ గా లేదు. దర్శకుడు ఈ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. సో కొన్ని చోట్ల నవ్వించినా కొన్ని చోట్ల మాత్రం బోర్ కొట్టిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు