మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది పట్ల ఆడియెన్స్ లో ఏ లెవెల్ అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కి కొత్త డేట్ గా ఇటీవల బుచ్చిబాబు కర ప్రీరిలీజ్ ఈవెంట్ లో జూన్ 25 ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
మళ్ళీ గ్యాప్ లోనే కొన్ని పరిస్థితులు మారడంతో పెద్ది సినిమా జూన్ 4న వచ్చే ఛాన్స్ వచ్చింది. అయితే ఈ డేట్ పట్ల క్రేజీ బజ్ నెలకొనగా ఫైనల్ గా మేకర్స్ ఈ సినిమాని అధికారికంగా ఇదే డేట్ లో తీసుకొస్తున్నట్టు లేటెస్ట్ ప్రెస్ మీట్ ద్వారా ఖరారు చేశారు. హైదరాబాద్ లో గ్రాండ్ ప్రెస్ మీట్ జరుగుతుండగా ఇందులో అధికారికంగా ఈ అప్డేట్ ని అందించారు.
సో మెగాపవర్ స్టార్ జాతర ఒకింత ముందే తీస్తున్నాడని చెప్పవచ్చు. ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఇది బెస్ట్ డేట్ కాగా వేసవి సెలవులు ముగింపులో పెద్ది చిత్రానికి ఇదొక బ్లాస్టింగ్ వెల్కమ్ దక్కే ఛాన్స్ అని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ గ్రౌండ్ దగ్గర రామ్ చరణ్ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.


