‘పెద్ది’ ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్?

‘పెద్ది’ ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్?

Published on May 5, 2026 12:14 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రమే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా చాలా కాలంగా తెలుగు సినిమా నుంచి ఓ పెద్ద సినిమా తీర్చని లోటుని తీరుస్తుంది అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు సరిగ్గా నెల వ్యవధి మాత్రమే ఉంది కానీ ఇంకా చాలా పనులు బాకీ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పెద్ది ప్రమోషన్స్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ప్రాపర్ ప్రమోషన్స్ మొత్తాన్ని ఈ మే 8 నుంచి మొదలు పెడతారని టాక్. ఆల్రెడీ ఆఫ్ లైన్ లో ప్రమోషన్స్ ని మొన్నామధ్యనే స్టార్ట్ చేశారు. కానీ ఇతర ప్రమోషన్స్ మాత్రం ఇంకా మొదలు కావాల్సి ఉంది. సో వీటిని ఎలా ప్లాన్ చేసారో చూడాలి. అసలే హిందీలో భారీ రిలీజ్ అని చెప్పారు. అందుకు ఏం ప్లాన్ చేసారో కూడా చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు