గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్ అమెరికాలో జూన్ 3 నుంచే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఐతే, తాజాగా ఈ సినిమా టికెటింగ్ గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఉత్తర అమెరికా అంతటా బుకింగ్‌లు ఇప్పుడు అధికారికంగా ప్రారంభమయ్యాయి!
* ఈ సినిమాకి నార్త్ అమెరికాలో తెలుగు వెర్షన్ ధరలు*
* ప్రీమియర్స్ – బుధవారం, జూన్ 3
* Standard 2D: $25 / $20
* PLF స్క్రీన్‌లు: అదనంగా $5
* Specialty Formats: అదనంగా $7–$10
*1వ వారం ధరలు*
* Standard 2D: $20 / $18
* PLF స్క్రీన్‌లు: అదనంగా $2–$5
* Specialty Formats: అదనంగా $7–$10
ఇక *హిందీ / తమిళం / మలయాళం / కన్నడ వెర్షన్లు*
* ప్రీమియర్ ధరలు వర్తించవు
* మొదటి రోజు నుండే సాధారణ ధరలు వర్తిస్తాయి
మొత్తానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి బుకింగ్స్ లో పెద్ది ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


