ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్

ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్

Published on May 10, 2026 9:10 PM IST

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న లాంగ్ అవైటెడ్ మాస్ చిత్రమే “కరుప్పు”. దర్శకుడు ఆర్ జే బాలాజీ తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కట్ ని ఇపుడు మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం సూర్య ఫ్యాన్స్ తనకిది పక్కా ఊర మాస్ కంబ్యాక్ సినిమాగా ఫిక్స్ అయ్యిపోయారు.

ఆ రేంజ్ లో దర్శకుడు ఆర్జే బాలాజీ సినిమా ట్రైలర్ కట్ ని చేయడం విశేషం. మొదట మంచి ఎమోషనల్ టోన్ లో మొదలైన ఈ ట్రైలర్ ఇక అక్కడనుంచి మాస్ మూమెంట్స్ తో క్రేజీ యాక్షన్ ఇంకా త్రిష పై లవ్ ట్రాక్ లతో ఇంకా ఇంట్రెస్టింగ్ గా సూర్యకి విలన్ గా ఆర్జే బాలాజీనే ఎదురుగా కనిపించడం మరో హైలైట్ గా కనిపిస్తూ ఒక ప్యాకెడ్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉందని చెప్పాలి.

ఇక ట్రైలర్ కట్ వీడియో విజువల్స్ అంతా ఒకెత్తు అయితే దీనికి ప్రాణం పోసి బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిపింది మాత్రం సాయి అభ్యంకార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాల్సిందే. తన స్కోర్ టోటల్ ట్రైలర్ మూమెంటంనే మార్చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనితో డెఫినెట్ గా అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా సూర్య గట్టి కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ మే 14న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు