పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను కలిశారు మోదీ. నిన్న ఆదివారం ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో పవన్, ఆయన సతీమణి అన్నా కొణిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
కాగా అన్నా లెజినోవా, మోదీతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ.. ‘ప్రధాని మోదీ మా ఇంటికి వచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు నేను ప్రామిస్ చేశాను’’ అని ఆ ఫొటోలకు అన్నా లెజినోవా ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు పవన్ ఇంటికి వెళ్లిన విషయాన్ని తెలుపుతూ మోదీ కూడా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.


