దళపతి విజయ్ స్టార్ పవర్.. ఐఎండీబీలో ఏకంగా 21 నుంచి రెండో స్థానంలోకి

దళపతి విజయ్ స్టార్ పవర్.. ఐఎండీబీలో ఏకంగా 21 నుంచి రెండో స్థానంలోకి

Published on May 13, 2026 2:00 PM IST

Thalapathy-Vijay

మన దక్షిణాది సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న స్టార్ హీరోస్ లో దళపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకరు. తన సినిమాలు కంటెంట్ అనుకున్న రేంజ్ లో లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ వాటికీ వందల కోట్ల వసూళ్లు అందిస్తారు. మరి అలాంటి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఎవరూ ఊహించని నంబర్స్ సెట్ చేసి చరిత్ర సృష్టించారు. అయితే విజయ్ లేటెస్ట్ గా మరో క్రేజీ ఫీట్ ని సెట్ చేయడం విశేషం.

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఇండియన్ సెలెబ్రెటీస్ లిస్ట్ లో విజయ్ గత వారం వరకు 21వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఏకంగా ఇండియా లోనే రెండో స్థానానికి చేరి విజయ్ తన స్టార్ పవర్ చూపించాడు. విజయ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన కోసం ఎంతోమంది సెర్చ్ చేయగా ఈ ఫీట్ సాధ్యం అయినట్టు తెలుస్తుంది. దీనితో విజయ్ క్రేజ్ ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్లోకి చేరుకుంది అని చెప్పొచ్చు. ఇక విజయ్ నుంచి నుంచి రానున్న రోజుల్లో తన ఆఖరి చిత్రం జన నాయగన్ వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు