న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ టీజర్ వచ్చేసింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సృష్టిస్తున్న ది ప్యారడైజ్ ప్రపంచాన్ని మనకు ఈ టీజర్‌లో చూపెట్టారు. మేకర్స్ ముందు నుంచీ చెబుతున్నట్లుగా ఈ టీజర్ ఆద్యంతం బ్లడ్ బాత్‌తో నింపేశారు.
జడల్ పాత్రలో నాని నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్యారడైజ్ ప్రపంచంలో తమ జాతి కోసం జడల్ చేసే పవర్‌ఫుల్ పోరాటమే ఈ సినిమా కథగా మనకు చూపించబోతున్నారు. అటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్‌లో ఇంప్రెస్ చేయబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక నాని ఇందులో చెప్పే డైలాగులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి.
ప్యూర్ మ్యాడ్‌నెస్‌గా కట్ చేసిన ఈ టీజర్‌తో జడల్ పాత్రపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక టీజర్ చివర్లో మనుషులను సింహాసనంగా మార్చి నాని కూర్చున్న తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ థండరింగ్ బీజీఎంతో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ‘ది ప్యారడైజ్’ టీజర్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 24, 2026న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


