అయోమయంలో ‘కరుప్పు’ రిలీజ్.. కంటనీరు పెట్టుకున్న దర్శకుడు..!

అయోమయంలో ‘కరుప్పు’ రిలీజ్.. కంటనీరు పెట్టుకున్న దర్శకుడు..!

Published on May 14, 2026 3:37 PM IST

Karuppu

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’(తెలుగులో వీరభద్రుడు) నేడు రిలీజ్ కావాల్సి ఉంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కొన్ని అడ్డంకుల వల్ల చివరి నిమిషంలో షోలు క్యాన్సిల్ చేసుకుంది. నిర్మాతలకు సంబంధించిన పాత ఆర్థిక బకాయిలు సెటిల్ కాకపోవడంతో, సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. దీనివల్ల ఉదయం మరియు మధ్యాహ్నం షోలు రద్దయ్యాయి.

ఇది సూర్య అభిమానులకు తీరని నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలో దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక ఎమోషనల్ వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ‘నేను నిజంగా క్షమాపణలు కోరుతున్నాను. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోయి, ఈరోజు సాయంత్రం 6 గంటల కల్లా సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

దర్శకుడి ఎమోషనల్ వీడియో చూసిన నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. మరి నేటి సాయంత్రానికైనా ‘కరుప్పు’ థియేటర్లలోకి వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు