నార్త్ థియేటర్లలో ల్యాండ్ అయిన ‘కరుప్పు’.. మేకర్స్‌కు ఇదో తలనొప్పి..!

నార్త్ థియేటర్లలో ల్యాండ్ అయిన ‘కరుప్పు’.. మేకర్స్‌కు ఇదో తలనొప్పి..!

Published on May 15, 2026 1:02 AM IST

Karuppu

తమిళ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా విడుదలలో తలెత్తిన ఆర్థిక అడ్డంకుల వల్ల ఉదయం, మధ్యాహ్నం షోలు రద్దయ్యాయి. ఈ పరిణామంతో తీవ్ర భావోద్వేగానికి గురైన దర్శకుడు ఆర్జే బాలాజీ, ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ సాయంత్రం కల్లా సినిమా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, అధికారిక ప్రదర్శనలు నిలిచి పోయినప్పటికీ నార్త్ ఇండియాలోని కొన్ని థియేటర్లలో అనుమతి లేకుండానే సినిమాను ప్రదర్శించడం కలకలం రేపింది. ఈ పొరపాటును క్యూబ్ సంస్థ అంగీకరించగా, చిత్ర బృందం వెంటనే ఆ షోలను మధ్యలోనే నిలిపి వేయించింది.

రూ.140 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఇలాంటి అనధికారిక ప్రదర్శనల వల్ల పైరసీ బారిన పడి భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరుస పరిణామాలతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

తాజా వార్తలు