పిక్ టాక్: రేణూ దేశాయ్ క్రేజీ ఫ్యాన్ మూమెంట్.. ఆ లెజెండరీ హీరోని కలిసి ఎమోషనల్!

పిక్ టాక్: రేణూ దేశాయ్ క్రేజీ ఫ్యాన్ మూమెంట్.. ఆ లెజెండరీ హీరోని కలిసి ఎమోషనల్!

Published on May 16, 2026 1:03 PM IST

మలయాళ సినిమా దగ్గర ఉన్నటువంటి సీనియర్ అండ్ స్టార్ నటుల్లో మమ్ముట్టి కూడా ఒకరు. తనదైన ఈజ్ నటనతో ఇప్పటికీ ఛార్మ్ లుక్ ని మైంటైన్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రముఖ నటి రేణు దేశాయ్ మమ్ముట్టితో కలిసి దిగిన ఓ పిక్ ని షేర్ చేసుకొని తన ఆనందాన్ని ఆమె వ్యక్తం చేశారు. మమ్ముట్టితో దిగిన సెల్ఫీ షేర్ చేసుకొని ఇది నాకొక క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అంటూ ఆమె ఎగ్జైట్మెంట్ కనబరిచారు.

సర్ తో కొన్ని నిమిషాలు సమయం గడపడం తన బకెట్ లిస్ట్ మూమెంట్స్ లో ఒకటి ఫైనల్ గా నెరవేరింది అని రేణు దేశాయ్ తెలిపారు. అలానే తాను కలిసిన అతి కొద్దిమంది మంచి మనుషులు, ఇంటెలిజెంట్ వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని ఆమె తెలిపారు. దీనితో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఇద్దరి కలయిక మామూలుగా జరిగిందేనా లేక ఏదన్నా సినిమాకి వర్క్ చేస్తున్నారా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు