విక్టరీ వెంకటేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమా కోసం ఓ ఫేమస్ ఓల్డ్ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ సాంగ్ వెంకీ పాత సినిమాలోది అని టాక్. అన్నట్టు ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
అన్నట్టు త్రివిక్రమ్, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


