గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో ఘనంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు గంటలు లెక్కపెడుతున్నారు. ఈ సినిమా ప్రచార ఇంటర్వ్యూలు వైరల్ అయ్యి, సినిమా పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మరి ట్రైలర్ విడుదలయ్యే క్షణంలో ఆ మ్యాజిక్‌ను చూడటానికి అభిమానులను మరింత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
పైగా సినిమా పై ఉన్న భారీ హైప్‌కు మరింత ఊపునివ్వడానికి ఒక అద్భుతమైన ట్రైలర్ అవసరం. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో తొలిరోజు వసూళ్లను సాధించడంలో కూడా ట్రైలరే ముఖ్యం. అందుకే, అందరి దృష్టి ఇప్పుడు ట్రైలర్ విడుదలపైనే ఉంది. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


