కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పురుష:’. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది.
వివాహ జీవితం, భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. “బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది” అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. భార్యాభర్తల గొడవలు, కుటుంబ భావోద్వేగాలకు వినోదాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు.
ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వెన్నెల కిషోర్, విషిక, హాసిని సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, కోటి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


