ప్రేమ కావాలా? డబ్బు కావాలా? తెలుగులోకి వచ్చేసిన ‘స్ప్లిట్స్‌విల్లా X6’

ప్రేమ కావాలా? డబ్బు కావాలా? తెలుగులోకి వచ్చేసిన ‘స్ప్లిట్స్‌విల్లా X6’

Published on May 20, 2026 8:00 AM IST

ప్రముఖ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’ 16వ సీజన్ ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్ యా పైసా’ పేరుతో ప్రారంభమైంది. తొలిసారిగా ఈ షోను తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 12 నుంచి ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు ఎమ్‌టీవీ ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్‌లో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ అవుతుంది.

తమిళనాడులోని మహాబలిపురం నేపథ్యంగా సాగే ఈ సీజన్‌లో మొత్తం 33 మంది సింగిల్స్ పాల్గొంటున్నారు. ఈసారి షోను ‘ప్యార్ విల్లా’, ‘పైసా విల్లా’ అనే రెండు విభాగాలుగా రూపొందించారు. ప్రేమ, డబ్బు మధ్య జరిగే పోరాటమే ఈ సీజన్ ప్రధాన కథాంశం. ఈ కార్యక్రమానికి సన్నీ లియోన్, కరణ్ కుంద్రా హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, షోలో ట్విస్టులు ఇచ్చే మిస్చిఫ్ మేకర్స్‌గా నియా శర్మ, ఉర్ఫీ సందడి చేయనున్నారు.

ఈ సందర్భంగా సన్నీ లియోన్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరం యువతలో ప్రేమ, బంధాలు ఎలా మారుతున్నాయో ఈ షో ప్రతిబింబిస్తుందని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన థీమ్ కంటెస్టెంట్ల భావోద్వేగాలకు ఒక పరీక్షగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు