అంచనాలను మరింత పెంచేసిన ‘నాగబంధం’.. కౌంట్‌డౌన్ షురూ..!

అంచనాలను మరింత పెంచేసిన ‘నాగబంధం’.. కౌంట్‌డౌన్ షురూ..!

Published on May 22, 2026 12:28 AM IST

డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘నాగబంధం’. తాజాగా విడుదలైన ఈ సినిమా కొత్త పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. కేవలం 44 రోజులు మాత్రమే మిగిలి ఉందంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం ఇండియాలోనే టాప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్‌లో ఆ గ్రాఫిక్స్ క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తోంది.

బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్ర హిందీ రైట్స్‌ను జీ స్టూడియోస్, డిజిటల్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం జూలై 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

తాజా వార్తలు