ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ ట్రీట్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ ట్రీట్ ఎప్పుడంటే?

Published on May 22, 2026 8:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు సెన్సేషనల్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేయనున్న క్రేజీ పాన్ ఇండియా చిత్రం అది కూడా నెవర్ బిఫోర్ స్కేల్ లో చేయనున్న సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా తాలూకా అఫీషియల్ అప్డేట్ మొన్న తారక్ పుట్టినరోజు వస్తుందని అంతా భావించారు.

ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఓ కాన్సెప్ట్ టీజర్ వీడియో విడుదల చేయాల్సి ఉంది కానీ వాయిదా వేశారు. ఇక దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ట్రీట్ ని మేకర్స్ జూన్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ యుద్దానికి దేవుడు అయిన కుమార స్వామి నేపథ్యంలో తెరకెక్కించనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు