సమీక్ష: ‘రమణి కళ్యాణం’ – ఫ్లాట్ గా సాగే మ్యూజికల్ లవ్ డ్రామా

సమీక్ష: ‘రమణి కళ్యాణం’ – ఫ్లాట్ గా సాగే మ్యూజికల్ లవ్ డ్రామా

Published on May 23, 2026 12:02 AM IST

విడుదల తేదీ : మే 22, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : దీప్షికా చంద్రన్, సూర్య వశిష్ట, శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతూ జొన్నలగడ్డ, జబర్దస్త్ మహేష్ తదితరులు
దర్శకుడు : విజయ్ ఆదిరెడ్డి
నిర్మాణం : కైట్స్ క్రియేటివ్స్
సంగీతం : సూరజ్ ఎస్ కురూప్
ఛాయాగ్రహణం : అరవింద్ తిరుకోవెల
కూర్పు : రవితేజ గిరిజాల

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ‘రమణి కళ్యాణం’ అనే చిన్న చిత్రం కూడా ఒకటి. యువ నటీనటులు సూర్య వశిష్ఠ అలాగే దీప్షికా చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన చిన్నతనంలోనే ఓ కార్ ఆక్సిడెంట్ లో కంటి చూపును కోల్పోతుంది సంజన ( దీప్షికా చంద్రన్) అలానే నేషనల్స్ లో క్రికెట్ ఆడాలని కలలుగంటూ తీరా సెలెక్ట్ అయ్యాక ఓ డిజాస్టర్ వల్ల తన కాళ్ళని పోగొట్టుకుంటాడు రాజ్ (సూర్య వశిష్ట). మరి ఈ ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు. వీరి నడుమ ప్రేమ కథ ఎలా సాగింది. ఈ క్రమంలో రాజ్ కి తెలియని మరో మెడికల్ సమస్య ఏంటి? చివరికి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా? చివరిలో సంజన తెలుసుకున్న షాకింగ్ నిజం ఏంటి అనేవి ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో యువ నటీనటులు ఇద్దరూ డీసెంట్ పెర్ఫామెన్స్ అందించే ప్రయత్నం చేశారు. కథనం ముందుకు వెళుతున్న కొద్దీ ఇద్దరి నటనలో బెటర్మెంట్ కనిపిస్తుంది. అలానే దీప్షికా బ్యూటిఫుల్ లుక్స్, తెరపై అందంగా కనిపించింది. అలానే సూర్య కూడా తనకి ఛాలెంజింగ్ రోల్ లో బాగానే చేసాడు. తన లుక్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.

ఇక వీరితో పాటుగా శ్రీనివాస్ రెడ్డి, శ్యామల తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మంచి పెర్ఫామెన్స్ అందించారు. ఇక కథనంలో చివరి కొన్ని నిమిషాలు అంతకు ముందున్న ఎమోషనల్ బ్లాక్స్ తో పోలిస్తే బెటర్ గా సాగాయి. అలానే చివరిలో ప్లాన్ చేసుకున్న ఒకటీ రెండు ట్విస్ట్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇందులో మరో మేజర్ ఎసెట్ సంగీతం అని చెప్పొచ్చు. పాటలు ఇందులో బాగా కంపోజ్ చేశారు. ఈ క్రెడిట్ సంగీత దర్శకునికే దక్కుతుంది.

మైనస్ పాయింట్స్:

ఇద్దరు వైకల్యం ఉన్న లీడ్ నటీనటుల నడుమ ఇంకా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథనాన్ని అల్లుకుంటే చూసే వీక్షకునిగా ఎక్కడా డీవియేట్ కాకుండా హుక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఆ అంశం బాగా మిస్ అయ్యిందని చెప్పాలి. ఇద్దరి నడుమ లవ్ స్టోరీ ట్రాక్ ని ప్లాన్ చేసుకున్నారు కానీ వారి నడుమ ఎమోషనల్ పార్ట్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఒక్క క్లైమాక్స్ పోర్షన్ లో తప్పితే మిగతా కథనంలో ఎక్కడా కదిలించే ఎమోషన్స్ ఇందులో లేవు. అంతే కాకుండా ఫస్టాఫ్ లో హీరో చెప్పే కొన్ని కొన్ని డైలాగ్ లు మరికొన్ని లాజిక్ లేని సీన్స్ వంటివి సిల్లీగా అనిపిస్తాయి. అలానే సినిమాలో లైన్ కూడా ‘ఆనంద్’ సినిమాని రిఫ్లెక్ట్ చేస్తుంది.

ఇక ఇవి పక్కన పెడితే కథనం చాలా వరకు ఊహాజనితంగానే సాగింది. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే సీన్స్ ని ఆడియెన్స్ ముందే ఊహించేస్తారు. ఇలాంటి సీన్స్ ఉంటూనే ఉంటాయి. లీడ్ నటీనటుల నడుమ లవ్ ట్రాక్ ని ఇంకా బెటర్ గా మంచి ఎమోషన్స్ తో ప్లాన్ చేసుకొని ఉంటే ఇందులో వారి ఇద్దరి నడుమ కెమిస్ట్రీ మరింత వర్కౌట్ అయ్యేది.

ఇక సెకండాఫ్ లో కథనం అక్కడక్కడా సాగదీతగా అనిపిస్తుంది. హీరోయిన్ తో కార్ నడిపించే సీన్ కూడా అసహజంగా ఉంది. ఇలా చాలా అంశాలు ఇందులో డిజప్పాయింట్ చేస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సూరజ్ ఎస్ కురూప్ ఇచ్చిన సంగీతం సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యింది. తాను అందించిన అన్ని పాటలు సినిమాలో బాగున్నాయి. అరవింద్ తిరుకోవెల కెమెరా వర్క్ బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి విషయానికి వస్తే.. లీడ్ పాత్రల ఎంపిక వాటిని డిజైన్ బానే ప్లాన్ చేసుకున్నారు కానీ వాటికి తగ్గ డ్రామా ఇంకా బలంగా తీసి ఉంటే బాగుండేది. ఒక్క క్లైమాక్స్ పార్ట్ తప్పితే మిగతా కథనం చప్పగానే సాగించారు. పెద్దగా కదిలించే ఎమోషన్స్ లేకుండా పోనీ లవ్ ట్రాక్ అయినా కొత్తగా ఉంటుందా అంటే అది కూడా మిస్ అయ్యింది. సో వీటితో తన వర్క్ ఈ చిత్రానికి ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘రమణి కళ్యాణం’ మంచి మ్యూజిక్ తో కేవలం కొంతమేర మాత్రమే ఓకే అనిపిస్తుంది కానీ మిగతా కథనం అంతా చాలా రెగ్యులర్ అండ్ ఫ్లాట్ గా సాగింది. లీడ్ పాత్రలతో ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసుకునే పొటెన్షియల్ ఉంది కానీ దీనిని దర్శకుడు చాలా సింపుల్ గా నడిపించేసారు. సో వీటితో ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు