అక్కడ సాలిడ్ హోల్డ్ తో ‘పెద్ది’

అక్కడ సాలిడ్ హోల్డ్ తో ‘పెద్ది’

Published on May 29, 2026 7:01 AM IST

Peddi-Movie

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్, స్పోర్ట్స్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లో థియేటర్స్ ని పాన్ ఇండియా లెవెల్లో టేకోవర్ చేయడానికి వస్తున్న ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అక్కడ సాలిడ్ హోల్డ్ తో ప్రీ సేల్స్ జరుపుకుంటుంది.

ఇలా పెద్ది సాలిడ్ మార్క్ ని అక్కడ క్రాస్ చేసింది. రీసెంట్ గానే హాఫ్ మిలియన్ డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 6 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. దీనితో పెద్ది హవా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఈజీగా 1 మిలియన్ గ్రాస్ కేవలం ప్రీమియర్స్ తోనే వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 4న సినిమా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు