తమ మొదటి సినిమాతోనే వంద కోట్లు కొట్టడం అనేది మన తెలుగు సినిమా దగ్గర ఏ దర్శకుడు, హీరో, హీరోయిన్ కి జరగలేదు. కానీ ఆ ఫీట్ ని మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి అలానే దర్శకుడు బుచ్చిబాబు సానాలు ‘ఉప్పెన’ అనే సినిమాతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చి 100 కోట్లు అందుకున్నారు. అయితే ఈ సినిమాలో అన్నిటికంటే కీలమైన పాత్ర ‘రాయణం’ది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన ఈ పవర్ఫుల్ రోల్ హీరోయిన్ కి తండ్రిగా సినిమాకి హైలైట్ గా నిలిచింది. అయితే అసలు ఇలాంటి రోల్ తనకి మిస్ అయ్యింది అని లేటెస్ట్ గా పెద్ది సినిమా ప్రమోషన్స్ లో వెర్సటైల్ నటుడు జగపతి బాబు చెప్పడం వైరల్ గా మారింది. ఆ రోల్ కోసం చెప్పడానికి బుచ్చిబాబు తన ఇంటి గేట్ వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాడని తాను షాకింగ్ నిజాన్ని రివీల్ చేశారు.
అయితే తర్వాత ఏమైంది అని అడగ్గా ఆ రోల్ కి నటుడు మార్కెట్ దృష్ట్యా విజయ్ సేతుపతి గారు అయితే బాగుంటుంది అని మనసు మార్చుకున్నట్టు బుచ్చిబాబు తెలిపాడని నాకు అతనిలో ఆ నిజాయితీ నచ్చింది అని జగపతి బాబు అసలు విషయం చెప్పారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.


