‘ది ప్యారడైజ్’ మళ్ళీ వాయిదా? అనిరుద్ తో ఏం లింక్?

‘ది ప్యారడైజ్’ మళ్ళీ వాయిదా? అనిరుద్ తో ఏం లింక్?

Published on May 30, 2026 9:00 PM IST

The Paradise

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం ది ప్యారడైజ్ కోసం అందరికీ తెలిసిందే. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది కాగా ఇది వరకే ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన సినిమాని మేకర్స్ వాయిదా వేశారు. మార్చ్ నుంచి ఏకంగా ఆగష్టు కి జరిగిన ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుంది అంటూ కొత్త రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

అయితే దీనికి సంగీత దర్శకుడు అనిరుద్ తో కూడా లింక్ ఉందని ఇంకో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్యారడైజ్ సినిమా ఆగష్టు 27న విడుదల అవుతుంది కానీ ఆ సమయంలోనే అనిరుద్ అందుబాటులో ఉండకుండా తన మ్యూజికల్ ఈవెంట్స్ ని యూఎస్, ఇతర దేశాల్లో చేయనున్నాడు. అయితే సినిమా వాయిదా కారణంగానే రిలీజ్ సమయంలో అవి ప్లాన్ చేసుకున్నాడని కొందరు అంటున్నారు.

కానీ నిజానికి తన కాన్సెర్ట్స్ కి సినిమా రిలీజ్ సమయానికి సంబంధం లేదు అనుకోవాలి. 27 విడుదల అంటే అంతకు ముందే ప్రీరిలీజ్ ఈవెంట్ అన్ని అయిపోతాయి. సో ప్యారడైజ్ విడుదల తర్వాత అనిరుద్ ఖాళీనే.. సో సినిమా వాయిదా పుకార్లలో నిజం లేదనే అనుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా ఉన్నా త్వరలోనే క్లారిటీ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు