ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రాకా” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ సినిమా నుంచి ఒక నెవర్ బిఫోర్ లెవెల్ ట్రీట్ ఇచ్చే సినిమాగా వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ని అట్లీ ప్లానింగ్ ప్రకారం చేస్తూ వెళుతుండగా అల్లు అర్జున్ మొత్తం మూడు షేడ్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు.
అయితే ప్రస్తుతం ఓ క్రేజీ టాక్ ఇపుడు వైరల్ గా మారింది. దీని ప్రకారం రాకా గ్లింప్స్ మరో రెండు నెలల తర్వాత ఆడియెన్స్ ముందుకు రానుంది అని తెలుస్తుంది. అంటే ఈ ఆగస్ట్ లోనే రాకా విజువల్ ట్రీట్ ఎలా ఉంటుంది అనేది అందరికీ ఒక క్లారిటీ వస్తుందట. సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా దీనిని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


