‘పెద్ది’ ర్యాంపేజ్.. అమెరికాలో మరో మార్క్ దాటేసింది!

‘పెద్ది’ ర్యాంపేజ్.. అమెరికాలో మరో మార్క్ దాటేసింది!

Published on Jun 1, 2026 8:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ డ్రామా “పెద్ది”. మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రాబోతుంది. అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ఇపుడు సాలిడ్ నిలకడ చూపిస్తూ దూసుకెళ్తుంది.

గత కొన్ని రోజులు నుంచి మంచి జంప్ చూస్తూ వెళుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా మరో మార్క్ 8 లక్షల డాలర్స్ గ్రాస్ ని దాటేసి అదరగొట్టింది. దీనితో రిలీజ్ నాటికి 1 మిలియన్ మార్క్ ని సునాయాసంగా క్రాస్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ రెండు మూడు రోజుల వసూళ్లు మరింత కీలకం అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా ఈ జూన్ 4న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు