రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్ కి డేట్ వచ్చేసింది!

రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్ కి డేట్ వచ్చేసింది!

Published on Jun 1, 2026 11:14 AM IST

Irumudi

మాస్ మహారాజా రవితేజ నుంచి ఇప్పుడు రాబోతున్న అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకుంది. ఒకప్పుడు రవితేజ సినిమాలు అంటే మొత్తం న్యూట్రల్ ఆడియెన్స్ ఎదురు చూసే రీతిలో మళ్ళీ ఈ సినిమాకి రిపీట్ అయ్యింది. ఇక ఇదే అంచనాలకి తగ్గట్టుగా మేకర్స్ కూడా వరుస అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు.

అలా మేకర్స్ ఇపుడు లేటెస్ట్ గా అంతా ఎదురు చూస్తున్న గ్లింప్స్ కి ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ జూన్ 3న ఈ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్టు ఓ క్లాస్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. హార్ట్ ఆఫ్ ఇరుముడి అంటూ ఈ గ్లింప్స్ రానున్నట్టుగా ఒక ఎమోషనల్ టచ్ ని ఇవ్వడం విశేషం. మరి ఈ మూడో తారీఖున రానున్న గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు