పెద్ది : నైజాంలో డైలమా.. బుక్ మై షోలో ర్యాంపేజ్..!

పెద్ది : నైజాంలో డైలమా.. బుక్ మై షోలో ర్యాంపేజ్..!

Published on Jun 3, 2026 12:32 AM IST

Peddii

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో ఊచకోత కోసేందుకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచడమే కాకుండా, అప్పుడే టికెట్ బుకింగ్స్‌లో సరికొత్త మైల్‌స్టోన్‌లను అందుకుంటూ సినిమాపై ఉన్న క్రేజ్‌ను నిరూపిస్తోంది.

ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించి అప్పుడే 2 లక్షలకు పైగా టికెట్లు ప్రీ-బుక్ అయిపోయాయి. సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం టాలీవుడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అయితే, నైజాం ఏరియాలో ఇంకా బుకింగ్స్ తెరుచుకోక ముందే ఈ రేంజ్‌లో ర్యాంపేజ్ చూపిస్తున్న రామ్ చరణ్, పెద్ది తో రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా జూన్ 4న థియేటర్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

తాజా వార్తలు