‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!

‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!

Published on Aug 11, 2026 6:48 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

అయితే, ఈ ట్రైలర్ ఏ సమయానికి రానుందనే విషయంపై చిత్ర యూనిట్ తాజాగా అప్‌డేట్ ఇచ్చేసింది. ఆగస్టు 12న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇక ఈ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. సాయి కుమార్, బేబీ నక్షత్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు