చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!

చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!

Published on Aug 11, 2026 8:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ తాజాగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన మాట్లాడుతూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, ఈ క్రమంలో తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ పై చిరు ఓ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. తన బర్త్ డే ట్రీట్ కానుకగా ఆగస్టు 22న మెగా 158 టీజర్ రానుందని.. దీనికోసం థమన్ అదిరిపోయే బీజీఎం ఇస్తున్నాడని.. అది అందరికీ నచ్చేలా ఉంటుందని చిరు చెప్పుకొచ్చారు.

దీంతో ‘మెగా 158’ టీజర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి మెగా 158 టీజర్‌పై చిరు లీక్ చేయడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు