ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి వారణాసి అలాగే బాలీవుడ్ నుంచి రామాయణ సినిమాలు మొదటి వరుసలో ఉంటాయని తెలిసిందే. భారీ బడ్జెట్ లతో మొట్ట మొదటి ఐమ్యాక్స్ సినిమాలుగా ఇవి ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సందడి చేయనున్నాయి.
అయితే ఈ చిత్రాలు విషయంలో పాపులర్ నటుడు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ మనోజ్ బాజ్ పాయ్ చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రామాయణ, వారణాసి సినిమాల బడ్జెట్ లెక్కలు అన్నీ కేవలం పి ఆర్ స్టంట్ లు మాత్రమే అని తాను అభిప్రాయపడ్డారు. ఇవి కేవలం హైప్ కోసం చెప్పే నెంబర్స్ అని దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఇదే తంతు కొనసాగుతుంది అని తాను ఇటీవల బాలీవుడ్ లో కామెంట్స్ చేశారు.
అయితే సడెన్ గా తన నుంచి ఈ టర్న్ రావడానికి కారణం ‘గవర్నర్’ సినిమా ప్రమోషన్స్ లో ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. అయితే ఈ సినిమాకి మినిమమ్ బజ్ లేకపోవడం మూలాన ఈ తరహా కామెంట్స్ తో తన సినిమాకి బూస్టప్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేసారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం మనోజ్ స్టేట్మెంట్ మాత్రం ఇపుడు రీచ్ బాగానే సొంతం చేసుకుంది.


