తమ సినిమాలతో సమాజానికి సందేశం అందిస్తూ మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ని కూడా అందించడంలో కోలీవుడ్ దర్శకులు శంకర్ మరియు ఏ ఆర్ మురుగదాస్ లు తమకంటూ సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ కూడా ఇపుడు సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.
శంకర్ గేమ్ ఛేంజర్ తో కంబ్యాక్ ఇస్తారు అనుకున్నారు కానీ కథ పూర్తిగా తనది కాకపోవడంతో ఆ సినిమాకి శంకర్ వర్క్ పూర్తి స్థాయిలోనిదే అని చెప్పడానికి లేదు. అలాగే ఏ ఆర్ మురుగదాస్ చేసిన ‘మదరాసి’ సినిమా తన రేంజ్ హిట్ కూడా కాలేదు జస్ట్ ఓకే అనిపించింది. దీనితో ఈ ఇద్దరు టాప్ దర్శకుడు కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంది.
అయితే శంకర్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘వేల్పరి’ సినిమా చేయడానికి ముందు ఓ కమర్షియల్ ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యిపోయేలా ప్లాన్ చేస్తున్నట్టు బజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో మురుగదాస్ కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఓ భారీ ప్రాజెక్ట్ చేసే ముందు ఓ చిన్న సినిమా చేసి సక్సెస్ కొట్టి అప్పుడు మళ్ళీ తన ట్రాక్ లోకి వెళ్లాలని ఆలోచిస్తునట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ఈ ఇద్దరు స్టార్ దర్శకులు చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకుని మళ్ళీ బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారతారో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.


