యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం నుండి ‘జిగితార’ అనే మెలోడీ సాంగ్ విడుదలైంది. తిరుపతిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన స్వరాలు అందించారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యాన్ని, సింగర్ కార్తీక్ తన గాత్రంతో మనసును హత్తుకునేలా ఆలపించాడు.
ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ వంటి హిట్ చిత్రాల నిర్మాతలు SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులను పూర్తి చేసుకుని ఈ చిత్రం జూలై నెలలో థియేటర్లలో విడుదల కానుంది.


