‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడేనా..?

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడేనా..?

Published on Sep 19, 2026 2:00 AM IST

Jr-NTR (1)

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో అక్టోబర్ మొదటి వారంలో తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

ఈలోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేని ఇతర ముఖ్య సన్నివేశాలను ఈ నెలలోనే చిత్రీకరించేందుకు షెడ్యూల్స్ సిద్ధం చేశారు. హీరోకు గాయం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ, ముందుగా ప్రకటించినట్లే 2027 జూన్ నాటికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు.

ప్రశాంత్ నీల్ తన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడానికి షెడ్యూళ్లను వేగవంతం చేస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు