ఇప్పుడు దక్షిణాది సినిమా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమానే జైలర్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన పార్ట్ 1 భారీ హిట్ అయ్యింది. దీంతో సీక్వెల్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది.
అయితే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ సినిమా విడుదల విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యలేదు. అయితే ఏదైనా స్పెషల్ అకేషన్ లో అయినా దీనిపై అప్డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ భావించారు. అలా నేడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్ డే వచ్చింది.
కానీ మేకర్స్ జస్ట్ విషెస్ చెప్పి ఊరుకున్నారు తప్పితే జైలర్ 2 కోసం మినిమం హింట్ కూడా ఇవ్వలేదు. దీనితో జైలర్ 2 రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా అనుకోవాలి. ఇంకోపక్క సినిమా రీ షూట్ కూడా అవుతుంది అనే టాక్ కూడా ఉంది. బహుశా దాని తర్వాత ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Happy Birthday to the blockbuster director who continues to entertain us with his unique filmmaking style and unconventional storytelling! @Nelsondilpkumar #HappyBirthdayNelson #HBDNelson pic.twitter.com/iJDR7cGeFi
— Sun Pictures (@sunpictures) June 21, 2026


