గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. NBK112గా తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెంలో గల టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ పవర్‌ఫుల్ లైన్ తోడవనుండటంతో ఈ క్రేజీ కాంబోపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక ఈ భారీ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఫిక్స్ కావడంతో అభిమానుల్లో ఈ మూవీపై హైప్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలోని మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
A powerful combo. An exciting beginning.#NBK112 begins on an auspicious note on June 25th, 9 AM onwards at TTD Sri Venkateswara Swami Temple, Venkatapalem, Andhra Pradesh.
Hon’ble Ministers Shri. @naralokesh Garu & Shri. @kanduladurgesh Garu will grace the occasion.… pic.twitter.com/2cEyBYvHaI
— Yuvasudha Arts (@YuvasudhaArts) June 22, 2026


