నారా కుటుంబంలో సరికొత్త సంతోషం వెల్లివిరిసింది. ప్రముఖ నటుడు నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించాడు.
గత ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఈ ఏడాది ప్రారంభంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే, నారా రోహిత్ ఇటీవల ‘సుందరకాండ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో దసరాకు విడుదల కానున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూనే, సోలో హీరోగా మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు.


