తమిళనాడు ముఖ్యమంత్రి, ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు హీరోగా సిల్వర్ స్క్రీన్ కి స్వస్తి చెప్పి పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తన పుట్టినరోజు రీసెంట్ గానే వచ్చింది. దీనితో అభిమానులు ఎంతో ఘనంగా ఈసారి పుట్టినరోజు జరిపారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా విజయ్ కి తమ విషెస్ తెలిపారు కానీ లేటెస్ట్ గా విజయ్ కి అంతకు మించిన స్పెషల్ విషెస్ ని నటి త్రిష చెప్పడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
గత కొన్నాళ్ల నుంచి విజయ్, త్రిష వ్యవహారం కోసం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇరువురు బయట కలిసే కనిపిస్తున్నారు. కానీ లేటెస్ట్ గా విజయ్ పుట్టినరోజుని త్రిష స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తూ తనవైపు ఓరగా చూస్తున్న పిక్ ని ఆమె షేర్ చేసుకుంది. దీనితో సోషల్ మీడియాలో మరోసారి వీరి జంట హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే మూమెంటంలో త్వరలోనే వీరిద్దరూ ఏమన్నా గుడ్ న్యూస్ చెబుతారా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.


