“జైలర్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్.. మొత్తానికి ఈ డేట్ లో టైగర్ ముత్తు వేల్ పాండియన్ రాక!?

“జైలర్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్.. మొత్తానికి ఈ డేట్ లో టైగర్ ముత్తు వేల్ పాండియన్ రాక!?

Published on Jun 26, 2026 8:02 AM IST

Jailer2

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో అభిమానులుకి మళ్లీ సెన్సేషనల్ ట్రీట్ ని సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 ని నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో పూర్తి చేసి ఇప్పుడు “ధర్మన్” సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ లతో మ్యాడ్ ట్రీట్ అందించారు. ఇక ఇదిలా ఉండగా అంతా జైలర్ 2 విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ జైలర్ 2 ని ఈ అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సో దీనిపై అధికారిక క్లారిటీ కూడా అతి త్వరలో రానుంది అని టాక్. ఇక ఈ సినిమాకి కూడా అనిరుద్ వర్క్ చేస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలానే ఇందులో కూడా అనేకమంది స్టార్ కామియోలు ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు