OG 2: పవన్ సినిమాపై థమన్ చెప్పింది వేరు!

OG 2: పవన్ సినిమాపై థమన్ చెప్పింది వేరు!

Published on Jul 8, 2026 6:28 PM IST

టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ సీక్వెల్/ప్రీక్వెల్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కలయికలో చేస్తున్న భారీ చిత్రం “ఓజి 2” కూడా ఒకటి. వీరి కలయికలో అనౌన్స్ అయ్యిన ఈ సినిమాపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో బ్లాస్ట్ అవుతుంది.

ఇక లేటెస్ట్ గా ఓజి షూట్ ఈ సెప్టెంబర్ నుంచే అంటూ ఓ టాక్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. సంగీత దర్శకుడు థమన్ లేటెస్ట్ కామెంట్స్ లో ఓజి 2 పై ఏదో ఒక అప్డేట్ సెప్టెంబర్ 2 ఉంటుంది అన్నట్టు చెప్పాడు తప్పితే అప్పుడు నుంచే షూట్ చేస్తున్నామని ఎక్కడా చెప్పలేదు.

సెప్టెంబర్ లో కలుద్దాం అని తెలిపాడు. సో షూట్ అప్పుడు నుంచే అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. దాదాపు నవంబర్ నుంచి ఓజి 2 షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ సెప్టెంబర్ 2 న అయితే పవన్ పుట్టినరోజు కానుకగా ఓ అప్డేట్ ఉండొచ్చు. సో దాని కోసం అభిమానులు వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు