ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న దాదాపు సీక్వెల్ సినిమాల్లో మన తెలుగు సినిమా నుంచే దాదాపుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ చిత్రాల్లో ఓ అవైటెడ్ సీక్వెల్ సినిమా “జై హనుమాన్” కూడా ఒకటి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మని టాలీవుడ్ లో స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఈ సినిమా మార్చేసింది.
యువ హీరో తేజ సజ్జ, కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి కలయికలో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. అయితే పార్ట్ 2 ని ప్రశాంత్ 2025 లోనే ప్రామిస్ చేసాడు కానీ ఆల్రెడీ 2026 కూడా సగం అయ్యిపోయింది. ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ తెలియడం లేదు.
అయితే ఆఫ్ లైన్ లో బజ్ ని పక్కన పెడితే రీసెంట్ మా ప్రోగ్రెస్ లో గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ‘జై హనుమాన్’ కోసం ఎదురు చూస్తున్నవారు బాగానే ఉన్నారు. పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ కావడంతో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని రిలీజ్ కోసం క్లారిటీ కోరుకుంటున్నారు. సో ఆఫ్ లైన్ లో మాత్రం జై హనుమాన్ క్రేజ్ పదిలంగానే ఉందని చెప్పొచ్చు. కానీ మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సినిమా కోసం ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.


