శ్రద్ధా దాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’.. ఇప్పుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్

శ్రద్ధా దాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’.. ఇప్పుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్

Published on Jul 11, 2026 8:00 AM IST

మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ‘త్రికాల’ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ అవుతోంది. ‘A Script of God’ అనే సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్ల విడుదల తర్వాత ఓటీటీల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఐఎండీబీ (IMDb)లో 9.1 రేటింగ్‌తో ట్రెండింగ్‌లో ఉందని చిత్రబృందం తెలిపింది.

​శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ, పునర్జన్మల నేపథ్యంతో కూడిన మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ చెన్న అందించిన ఛాయాగ్రహణం, షాజీద్ హ్యుమాయన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.

తాజా వార్తలు