దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనది బాలయ్యకి అన్నయ్య పాత్ర అని.. కేవలం ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే సంజయ్ దత్ పాత్ర వస్తోందని టాక్ నడుస్తోంది. ఇక కొరటాల శివ సినిమా అనగానే.. కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది.
కాగా నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు. మరి ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా నేపథ్యం ఏమిటో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


