అమెరికాలో అఖిల్ ‘లెనిన్’కి మరో మైలురాయి !

అమెరికాలో అఖిల్ ‘లెనిన్’కి మరో మైలురాయి !

Published on Jul 13, 2026 10:03 AM IST

యంగ్ హీరో అక్కినేని అఖిల్ – దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) కలయికలో వచ్చిన సినిమా ‘లెనిన్’. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. రోజులు గడిచేకొద్దీ, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఇంకా మెరుగైన స్పందన లభిస్తూ, వసూళ్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొదటి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. దీంతో, ఈ చిత్రం ఇప్పుడు అమెరికా మార్కెట్‌లో కూడా మరో మైలురాయిని దాటింది.

అక్కడ బాక్సాఫీస్‌ వద్ద సునాయాసంగా హాఫ్ -మిలియన్ డాలర్ల మార్కును సాధించి, అఖిల్ కెరీర్‌లోనే ఒక భారీ విజయంగా ఈ సినిమా నిలిచింది. ఇక రాబోయే కీలకమైన వారాంతపు రోజుల్లో ఈ చిత్రం తన బాక్సాఫీస్ పట్టును ఎంత బాగా కొనసాగిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సునీల్, బ్రహ్మాజీ, శివాజీ మరియు ఈశ్వరీ రావు వంటి సహాయ నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మొత్తానికి ఈ సినిమా పై అఖిల్ పెట్టుకున్న హోప్స్ నిజం అయ్యాయి. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనకి నిర్మాతలు అక్కినేని నాగార్జున – సూర్యదేవర నాగ వంశీ ఫుల్ జోష్ లో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు