‘రామాయణ’లో మరో స్పెషల్ రోల్ ?

‘రామాయణ’లో మరో స్పెషల్ రోల్ ?

Published on Jul 13, 2026 2:02 PM IST

Ramayana

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్‌.. రావణుడిగా కనిపించనున్నారు. ఆయన సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో మరో స్పెషల్ రోల్ ఉందని.. అది విశ్వామిత్ర పాత్ర అని, ఈ పాత్రలో మరో సీనియర్ సౌత్ హీరో కనిపిస్తాడని అంటున్నారు. రణబీర్ కపూర్ కెరీర్లోనే ఇది బిగ్‌ ప్రాజెక్ట్‌. అందుకే, ఈ సినిమా కోసం అతని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అటు సినీప్రియులందరి దృష్టి కూడా ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు. పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు