కృష్ణ కుమార్, అర్పిత లోహిల ‘1=100’ టీజర్ విడుదల

కృష్ణ కుమార్, అర్పిత లోహిల ‘1=100’ టీజర్ విడుదల

Published on Jul 14, 2026 8:00 AM IST

కృష్ణ కుమార్, అర్పిత లోహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “1=100” టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర టీజర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు.

యాక్షన్ ఎలిమెంట్స్, వెస్ట్రన్ స్టైల్ విజువల్స్ నేపథ్యంతో సాగే ఈ చిత్రానికి అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ అందించగా, కెన్నీ చైతన్య సంగీతాన్ని సమకూర్చారు. నందమూరి హరి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం డిజిక్వెస్ట్ సంస్థలో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీజర్‌కు లభిస్తున్న రెస్పాన్స్‌తో సంతోషంగా ఉన్నామని పేర్కొన్న చిత్ర యూనిట్, త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ప్రకటించింది.

తాజా వార్తలు