రజినీ ‘ధర్మన్’ లోకి ‘డ్రాగన్’ బ్యూటీ.. స్టార్ కమెడియన్ తో సీన్స్?

రజినీ ‘ధర్మన్’ లోకి ‘డ్రాగన్’ బ్యూటీ.. స్టార్ కమెడియన్ తో సీన్స్?

Published on Jul 15, 2026 1:00 PM IST

Dharman

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రమే ‘ధర్మన్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్ లకి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదిలా ఉండగా ధర్మన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ రూమర్స్ కూడా కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలా ఓ యువ బ్యూటీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకోనుంది అన్నట్టుగా టాక్ మొదలైంది.

పాపులర్ కమెడియన్ తో షూట్ లో డ్రాగన్ బ్యూటీ?

కన్నడ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరైన యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనితో పాటుగా ధర్మన్ లో కూడా ఓ కీలక పాత్ర కోసం రుక్మిణి పేరు పరిశీనలో ఉన్నట్టుగా పలు రూమర్స్ తాజాగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంది అని వినిపిస్తుంది. అంతే కాకుండా ఆమె స్టార్ కమెడియన్ యోగిబాబుతో కలిసి ధర్మన్ లో పలు కామెడీ సీన్స్ చేస్తుంది అంటూ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ముందు ‘జైలర్ 2’ కోసం అంతా వెయిటింగ్..

ధర్మన్ సంగతి పక్కన పెడితే ఈ ఏడాదిలో రజినీ నుంచి రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ జైలర్ 2 పట్ల మరింత ఆసక్తి నెలకొంది. ఆ ప్రాజెక్ట్ ని మేకర్స్ ఈ అక్టోబర్ 15న విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు