‘స్పిరిట్’లో ప్రభాస్ తో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్..!

‘స్పిరిట్’లో ప్రభాస్ తో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్..!

Published on Jul 15, 2026 5:30 PM IST

Spirit

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న సినిమా ‘స్పిరిట్’ పై ఉన్న అంచనాలే వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ప్రభాస్ పై సందీప్ రెడ్డి వంగ సిద్ధం చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ లే ఇందులో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవనుండగా అలాంటి వాటిలో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ వర్సెస్ ఓ 50 మంది రౌడీస్ తో రాత్రి పూట నడిచే సీన్ ఉన్నట్టు తెలుస్తుంది. డార్లింగ్ లూస్ ఫిట్ డ్రెస్సింగ్ లో సందీప్ వంగ మాస్ టేకింగ్ తో ఈ మొత్తం సీక్వెన్స్ అదిరిపోతుందట.

దీనితో స్పిరిట్ లో ఈ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు