చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా ‘కరుణామయ’.. చిత్రం ప్రారంభోత్సవం

చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా ‘కరుణామయ’.. చిత్రం ప్రారంభోత్సవం

Published on Jul 15, 2026 8:00 AM IST

చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా పరిచయమవుతున్న కొత్త చిత్రం ‘కరుణామయ’ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. బాబీ పిక్చర్స్ బ్యానర్‌పై సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు.

బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్, వి. ఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆరాధ్య హైందవి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో, కుటుంబ ఎమోషన్స్‌తో సాగే కథగా ఉండబోతోందని చిత్ర బృందం పేర్కొంది.

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మోనిక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు