మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రన్ ముగించుకుని ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీ మినహా మిగిలిన అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ వ్యూస్‌తో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో 3వ స్థానంలో దూసుకుపోతోంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా చిత్రం, బలమైన ఎమోషన్స్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ఆర్.రత్నవేలు అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మిస్ అయిన వారికి ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో ఒక బెస్ట్ వాచ్‌గా నిలుస్తోంది.


