బ్రేకింగ్ అప్డేట్: ప్రభాస్ పై ఊహించని పోస్టర్ తో ‘ఫౌజీ’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్!

బ్రేకింగ్ అప్డేట్: ప్రభాస్ పై ఊహించని పోస్టర్ తో ‘ఫౌజీ’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్!

Published on Jul 16, 2026 11:34 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రమే “ఫౌజీ”. యంగ్ హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తూ తెలుగు సినిమాకి పరిచయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ ఇప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది.

ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ అప్డేట్ వెనుక ఉన్న సస్పెన్స్ ని మేకర్స్ ఫైనల్ గా ఇప్పుడు బ్రేక్ చేశారు. ఇలా ప్రభాస్ పై ఓ క్రేజీ పోస్టర్ తో సినిమా విడుదలని ఈ ఏడాది డిసెంబర్ 3న భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేసేసారు. ఇక దీనిపై వదిలిన పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ లో ఊహించనిదిగా మారింది.

ప్రభాస్ భీకర యుద్ధం చేసి పంచె కట్టులో రైఫిల్ పట్టుకొని సేద తీరుతున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది అని చెప్పాల్సిందే. సో మొత్తానికి ఇది మాత్రం ప్రభాస్ అభిమానులకి బిగ్గెస్ట్ ట్రీట్ గా ఈ ఏడాదిలో నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు