కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కేవలం దర్శకునిగానే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన సాలిడ్ వైలెంట్ యాక్షన్ చిత్రమే ‘డీసీ’. వామికా గబ్బి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు వరకు వచ్చిన సాలిడ్ కంటెంట్ మంచి బజ్ ని ఆడియెన్స్ లో రేకెత్తించింది.
అయితే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ వారు ఏ సర్టిఫికెట్ ని ఇవ్వడం విశేషం. సో ఈ సినిమా పెద్దలకి మాత్రమే కానీ చిన్న పిల్లలకి కాదు అని క్లారిటీ వచ్చేసింది. అలాగే దీనితోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ముందుగా మేకర్స్ ఈ సినిమా డేట్ ని జూలై 31 కి లాక్ చేశారు కానీ ఇప్పుడు కొత్త డేట్ గా ఆగష్టు 7 నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నట్టుగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపారు.


