మాసివ్ క్లైమాక్స్ కి సిద్ధమైన నాని ‘ప్యారడైజ్’!?

మాసివ్ క్లైమాక్స్ కి సిద్ధమైన నాని ‘ప్యారడైజ్’!?

Published on Jul 16, 2026 3:12 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే ‘ది ప్యారడైజ్’. జడల్ జమానా అంటూ భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా షూట్ పూర్తి కానందున ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? విడుదల ఎప్పుడు అనే క్లారిటీ ఇపుడు తెలుస్తుంది.

ప్రస్తుతం మేకర్స్ ఓ మాసివ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఇది పూర్తయితే ఇక ప్యారడైజ్ కంప్లీట్ అయిపోయినట్టే అట. ఇంకొంచెం ఇతర వర్క్ ను కూడా ఈ క్లైమాక్స్ షూట్ అనంతరం పూర్తి చేస్తారని తెలుస్తుంది.

సో నాని సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. రీసెంట్ గానే సినిమా సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ కూడా క్లైమాక్స్ కోసం ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు